: పంజాబ్ పై దాడులకు సిక్కు ఉగ్రవాదులను ఎగదోస్తున్న ఐఎస్ఐ


భారత్ పై దాడులు చేసేందుకు నిరంతరం ఉగ్రవాదులను ఎగుమతి చేసే పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఇప్పుడు సిక్కు ఉగ్రవాదులపై దృష్టి సారించింది. భారత్ పై దాడులు చేయాల్సిందిగా వారిని ఆదేశించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. సర్బత్ ఖల్సా నిర్వాహకులను అరెస్ట్ చేసిన ఘటనను ఆసరాగా చేసుకుని... దాడులకు ఉసిగొల్పుతోంది ఐఎస్ఐ. ఈ నెల 10వ తేదీన బటిండాలో సిక్కులు సర్బత్ ఖల్సా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అల్లర్లు సృష్టించాలని బబ్బార్ ఖల్సా ఉగ్రవాదులు ప్రణాళికలు రచించారు. ఈ విషయం ముందే తెలవడంతో, పంజాబ్ ప్రభుత్వం సర్బత్ ఖల్సాకు అనుమతి ఇవ్వలేదు. అంతేకాదు, 12 మంది బబ్బార్ ఖల్సా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడినట్టు సమాచారం అందడంతో, ఆదివారం నాడు దాదాపు 180 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అనుమానిత ఉగ్రవాది కమల్ దీప్ సింగ్ ను అక్టోబర్ 23న అరెస్ట్ చేసినప్పటి నుంచి పంజాబ్ లో వాతావరణం వేడెక్కింది.

  • Loading...

More Telugu News