: ఏపీకి అన్ని విధాలా సాయం అందిస్తాం: పనగారియా
ఏపీ ఒంటరి కాదని, అన్ని విధాలా సాయం అందిస్తామని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా అన్నారు. రాష్ట్ర అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజంటేషన్ ఇచ్చారు. కోస్టల్ ఎకనామిక్ అండ్ ఎంప్లాయిమెంట్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై చర్చించారు. ఏపీకి అండదండగా ఉంటామని ఈ సందర్భంగా పనగారియా పేర్కొన్నారు. విజయవాడలో జరుగుతున్న ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ కూడా పాల్గొన్నారు.