: రోడ్డు దాటుతున్న అమ్మమ్మ, మనవరాళ్లని ఢీ కొట్టిన కారు... అమ్మమ్మ మృతి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తోన్న హ్యూందయ్ ఐ20 కారు రోడ్డు దాటుతున్న అమ్మమ్మ, మనవరాళ్లని ఢీకొట్టింది. కారు ఢీ కొట్టిన వేగానికి ఇద్దరూ కొన్ని అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో జైనీత్ థామస్(63) మృతి చెందగా, ఆమె మనువరాలు ప్రీషా(15) స్వల్పగాయంతో బయటపడింది. జైనీత్ ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు తన కూతురిని చూడడానికి వచ్చింది. తన మనువరాలు ప్రీషాతో కలిసి షాపింగ్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.