: ప్రొఫెసర్ లక్ష్మిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం: డీజీపీ సాంబశివరావు


గుంటూరు మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిని త్వరలోనే పట్టుకుంటామని ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితురాలైన ఆమె పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతోందని, వెంటనే లొంగిపోవాలని ఆయన సూచించారు. అయితే, నిందితురాలు లక్ష్మిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వారిపైనా చర్యలు తీసుకునే విషయంలో వెనుకాడబోమని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. కాగా, ప్రొఫెసర్ లక్ష్మి అసభ్యపదజాలంతో సంధ్యారాణిని వేధిస్తుండేదనే విషయం విచారణ కమిటీ నివేదికలో ఇటీవల తేలింది. ఒక అధ్యాపకురాలు ఇంత దారుణంగా వేధింపులకు పాల్పడటం ఏ కళాశాలలోనూ తాము చూడలేదని గుంటూరు మెడికల్ కాలేజీకి చెందిన ఒక అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News