: హైదరాబాదీల కలల బండి వచ్చేస్తోంది.. వచ్చే ఉగాది నుంచే మెట్రోరైలును ప్రారంభిస్తామన్న మెట్రోరైల్ ఎండీ
హైదరాబాదీలు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న కలల బండి మెట్రోరైల్ పట్టాలెక్కడానికి సిద్ధమవుతోంది. వచ్చే ఉగాది నుంచి మెట్రోరైలును నడిపిస్తామని మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ రోజు మీడియాకు తెలిపారు. ఒక వేళ ఆ రోజు వీలుకాకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవం(జూన్ 2) నాడు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నాగోల్-మెట్టుగూడ, మియాపూర్-ఎస్సార్ నగర్ మార్గాల్లో మొదటి దశ మెట్రో రైల్ ప్రారంభం అవుతుందని చెప్పారు. మెట్రోపనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, పాతబస్తీ మినహా ఎక్కడా సమస్యలేదని ఆయన పేర్కొన్నారు.