: అక్కినేని అఖిల్ వివాహంపై ట్వీట్ చేసి, డిలీట్ చేసిన వర్మ
ట్వీట్లతో హీట్ పుట్టించడంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంటే గొప్ప వ్యక్తి ఎవరూ లేరని చెప్పుకోవచ్చు. అది కేసీఆర్ కావచ్చు, చిరంజీవి కావచ్చు... మనసులో ఉన్నది ట్విట్టర్లో చెప్పేయడం వర్మ స్టైల్. ఒకసారి ఒక ట్వీట్ వదిలాడంటే... దాన్ని మళ్లీ వెనక్కి తీసుకోవడం వర్మ చరిత్రలోనే లేదు. కానీ, తొలిసారి వర్మ ఆ పని చేశాడు. నాగార్జున కుమారుడు అఖిల్ పై ట్వీట్ చేసి, ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశాడు. అఖిల్ పై వర్మ ఏం ట్వీట్ చేశాడంటే... "కెరీర్ అనేది మొదలవక ముందే పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావ్. నేనూ అలాగే చేశా. అయితే, నీవు ఆమె జీవితాన్ని అస్తవ్యస్తం చేయవనే అనుకుంటున్నా". ఇది వర్మ ట్వీట్. ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో కానీ... ఆ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేశాడు.