: 'దేవుడి దయవల్ల ఈ స్టంట్ ను పూర్తిచేస్తా'నన్న కన్నడ నటుడు ఉదయ్.. అంతలోనే దుర్మరణం!


కన్నడ చిత్రం ‘మాస్తిగుడి’ క్లైమాక్స్ షూటింగ్ లో ప్రాణాలు విడిచిన నటుడు ఉదయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను తలచుకుని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ‘ఇలాంటి స్టంట్ ను నేను చేయడం ఇదే మొదటిసారి. మొదటి అంతస్తు నుంచి కిందకు చూడాలంటేనే భయపడే నేను, ఆ దేవుడి దయ వల్ల ఈ స్టంట్ పూర్తి చేస్తానని ఆశిస్తున్నా’ అంటూ కన్నడ న్యూస్ ఛానెల్ ‘సువర్ణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా, 'జక్కన్న', 'బుల్లెట్ రాణి' వంటి తెలుగు చిత్రాల్లో కూడా ఉదయ్ నటించాడు. తాజాగా, ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ చిత్రంలో కూడా ఉదయ్ నటించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News