: పరిశ్రమలు, ఉపాధి కల్పనపై బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా?: ఏపీ మంత్రి గంటా సవాల్


పరిశ్రమలు, ఉపాధి కల్పనపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధిపై జగన్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందుందని కేంద్రం ప్రకటించిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే లెక్కలు తప్పని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. నిరూపించకపోతే జగన్ కూడా ఎలాంటి శిక్షకైనా సిద్ధమా? అని అడిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేసే నైతిక అర్హత జగన్‌ కు లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన తీరు మారకుంటే ఆ పార్టీకి ప్రతిపక్షహోదా కూడా దక్కదని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News