: సినిమాల్లో రోజా బికినీ డ్యాన్స్ చేసినట్లుగా ‘బీచ్ ఫెస్టివల్’ ఉండదు: బోండా ఉమ
విశాఖపట్టణంలో బీచ్ ఫెస్టివల్ విషయమై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటి రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ఘాటుగా స్పందించారు. రోజా సినిమాల్లో బికినీ వేసుకుని డ్యాన్స్ చేసినట్లుగా, అశ్లీలతను ప్రోత్సహించే విధంగా మాత్రం బీచ్ ఫెస్టివల్ ఉండదన్నారు. తెలుగింటి ఆడపడుచులు గర్వంగా చూడగలిగే ప్రదర్శనలను మాత్రమే ఈ ఫెస్టివల్ లో నిర్వహించనున్నారని ఉమ చెప్పారు. కాగా, విశాఖలో నిన్న నిర్వహించిన ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభలో మాట్లాడిన రోజా, సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నలభై ఏళ్ల జగన్ ప్రజల కోసం కష్టపడుతూ, ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేస్తుంటే, ముసలి నాయకుడు చంద్రబాబు 'బీచ్ ఫెస్టివల్' అంటుండటం సిగ్గుచేటంటూ ఆమె ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి విదితమే.