: ఎవరికైనా కాఫీ కావాలా?: సానియా మీర్జా
‘ఎవరికైనా కాఫీ కావాలా????’ అంటూ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నించింది. ఈ ప్రశ్న వెనుక అసలు విషయమేంటంటే ... బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో సానియా కన్పించనుంది. ‘కాఫీ విత్ కరణ్’ 5వ సీజన్ ని నిన్నటి నుంచి ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో సానియాతో ఒక షో చేస్తున్నాడు. ఈరోజు షూటింగ్ కోసం సిద్ధమైన సానియా తన ట్విట్టర్ ఖాతాలో ఈ వ్యాఖ్య చేసింది. అంతేకాకుండా, కరణ్ జోహర్, కొరియో గ్రాఫర్ ఫరాఖాన్ తో కలిసి దిగిన ఒక ఫొటోను కూడా సానియా పోస్ట్ చేసింది.