: అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి హైకోర్టు అనుమతి.. డిసెంబరు 21న తొలిదశ అమ్మకాలు
అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి ఈ రోజు హైకోర్టు నుంచి అనుమతి వచ్చింది. వచ్చేనెల 19న సీల్డ్ కవర్‌లో ఆస్తుల జాబితా సమర్పించాలని ఆ సంస్థకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరు 21న తొలిదశ అమ్మకాలు జరపాలని పేర్కొంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అగ్రిగోల్డ్ యాజమాన్యం తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. కేసులో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా తమకు న్యాయం జరగాలని అగ్రిగోల్డ్ బాధితులు కోరారు.