: పేలిన టైరు.. తిరుపతిలో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు.. ప్రయాణికులు సురక్షితం
తిరుపతి నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి కొద్ది సేపటి క్రితం ముప్పు తప్పింది. తిరుపతి విమానాశ్రయంలో విమానం బయలుదేరిన వెంటనే విమాన టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో విమానాన్ని అక్కడే నిలిపివేశారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు మరో విమానం ద్వారా ప్రయాణికులను ఢిల్లీకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. విమానంలోని మొత్తం 178 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.