: ప్రభుత్వ ఘనతను ఆర్బీఐ గుర్తించిన విషయం జగన్ కు తెలియనట్టుంది: ప్రత్తిపాటి


ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. దేశంలో 15 శాతం పెట్టుబడులను సాధించిన రాష్ట్రంగా ఏపీని రిజర్వ్ బ్యాంక్ గుర్తించిందని... ఈ విషయం వైసీపీ అధినేత జగన్ కు తెలియనట్టుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఏపీకి వస్తున్న పెట్టుబడులు, ఉద్యోగావకాశాలను అడ్డుకోవడమే జగన్ లక్ష్యమని మండిపడ్డారు. నవ్యాంధ్రప్రదేశ్ లో 2 లక్షల 23 వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఇప్పటివరకు కల్పించామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన సగం హామీలను ఇప్పటికే నెరవేర్చామని తెలిపారు. నిరుద్యోగ భృతిపై వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News