: వాళ్ల పాదయాత్రలు రైతుల కోసం కాదు, రాజకీయాల కోసం: తెలంగాణ మంత్రి పోచారం


తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు చేస్తోన్న పాదయాత్రలు రైతుల కోసం కాదని, రాజకీయాల కోసమని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. రానున్న ఐదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. నకిలీ విత్తనాల విషయంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై కేసులు నమోదు చేశామని ఈ సందర్భంగా చెప్పారు.

  • Loading...

More Telugu News