: అద్దె గర్భం ద్వారా బిడ్డను కంటానంటున్న హాలీవుడ్ భామ
హాలీవుడ్ నటి, మోడల్, టీవీ ప్రెజెంటర్ కిమ్ కర్దాషియన్ (36) మరోసారి తల్లి కావాలని నిర్ణయించింది. అయితే సరొగసీ (అద్దె గర్భం) ద్వారా ఈ సారి తల్లి కావాలని ఆమె భావిస్తోంది. 'కీపింగ్ అప్ విత్ ద కర్దాషియన్' అనే కొత్త ఎపిసోడ్ ప్రోమో విడుదల సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఆమెకు నార్త్ వెస్ట్ అనే కుమార్తె, సెయింట్ వెస్ట్ అనే కుమారుడు ఉన్నారు. తన ప్రస్తుత భర్త (మూడో భర్త) కేన్ వెస్ట్ తో ఈ ఇద్దరు బిడ్డలకు కిమ్ జన్మనిచ్చింది. కిమ్ కర్దాషియన్ నిర్ణయం విని ఆమె తల్లి క్రిస్ జెన్నర్ కూడా షాక్ అయ్యారు.