: 90 శాతం వరకూ తగ్గనున్న 2 వేల ఔషధాల ధరలు: జేపీ నడ్డా


దాదాపు 2 వేల రకాలకు చెందిన ఔషధాల ధరలు ఎంఆర్పీ (గరిష్ఠ చిల్లర ధర)తో పోలిస్తే, సుమారు 90 శాతం వరకూ తగ్గనున్నాయి. అమృత్ పథకం కింద మెడిసిన్ ధరలను తగ్గించే నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. ఇందులో భాగంగా 2 వేల రకాల ఔషధాల ధరలు 60 నుంచి 90 శాతం వరకూ తక్కువ ధరలకు ప్రజలకు లభ్యమవుతాయని తెలిపారు. జబల్ పూర్ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మధ్యప్రదేశ్ లో ప్రజలకు మరిన్ని వైద్య సౌకర్యాలను దగ్గర చేసేందుకు కేంద్రం తరఫున సహాయాన్ని అందించనున్నట్టు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడం ప్రభుత్వాల బాధ్యతని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News