: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎన్డీటీవీ ఇండియా
కొన్నినెలల క్రితం జరిగిన పఠాన్ కోట్ ఉగ్రదాడి సమయంలో నిబంధనలకు విరుద్ధంగా పలు దృశ్యాలను ప్రసారం చేసిందనే ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం ప్రముఖ జాతీయ ఛానెల్ ఎన్డీటీవీ ఇండియాపై 24 గంటల నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ఛానెల్ చూపిన దృశ్యాలను ఉగ్రవాదులు చూస్తే, భారత జవాన్లతో పాటు పౌరులకు కూడా ముప్పు ఉందని కేంద్రమంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ అంశంపై ఎన్డీటీవీ ఇండియా ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ ఛానెల్‌పై నిషేధాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది.