: అమెరికాలో భూకంపం... నేలకొరిగిన భవనాలు
అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో నిన్న రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదయింది. ఓక్లహామా సిటీ నుంచి 50 మైళ్ల దూరంలో ఉన్న ఆర్కాన్సాస్, కాన్సాస్, కషింగ్, మిస్సోరి ప్రాంతాల్లో భూకంప ప్రభావంతో పలు భవనాలు నేలకొరిగాయి. అయితే, ప్రాణనష్టం మాత్రం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. మరోవైపు, వారం క్రితం కూడా ఓక్లహామాలో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఏడాది కాలంలో 3కు పైగా తీవ్రతతో అక్కడ 1,010 భూకంపాలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ వల్లే ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.