: పూంచ్ జిల్లాలో మరోసారి పాకిస్థాన్ రేంజర్ల కాల్పులు
జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నిన్న జరిపిన పాకిస్థాన్ రేంజర్ల కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ రోజు అదే జిల్లాలోని మెంధర్‌లో పాకిస్థాన్ రేంజర్లు మరోసారి రెచ్చిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు పొడుస్తూ కాల్పులు జరుపుతున్నారు. పాక్ కవ్వింపు చర్యలను భారత సైన్యం తిప్పికొడుతోంది. ఎదురు కాల్పులు జరుపుతూ పాక్ రేంజర్ల చర్యలను ఎదుర్కొంటోంది. కాల్పుల్లో భారత జవాన్లకు ఎటువంటి గాయాలు కాలేదు. పాక్ రేంజర్లకు జరిగిన నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.