: ఈ నెల 16న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న స‌చిన్ టెండూల్కర్


నెల్లూరు జిల్లాలోని పీఆర్‌ కండ్రిగ గ్రామాన్ని టీమిండియా మాజీ ఆట‌గాడు సచిన్‌ టెండూల్కర్‌ దత్తత తీసుకున్న విష‌యం తెలిసిందే. తన ఎంపీ నిధులను స‌చిన్ ఆ గ్రామాభివృద్ధికే వినియోగిస్తున్నారు. అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ గ్రామంలో స‌చిన్ అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 16న ఆయ‌న ఆ గ్రామంలో ప‌ర్య‌టించి, అక్క‌డ‌ కొన‌సాగుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. స‌చిన్ రాక కోసం ఆ గ్రామంలో అధికారులు ముమ్మ‌ర ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News