: గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వణికిపోతున్న విశాఖ ఏజెన్సీ
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా చలి పెరిగి జనాలను వణికిస్తోంది. విశాఖలోని ఏజెన్సీ ప్రాంతంలో అయితే బాగా పొద్దెక్కే వరకు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చే సాహసం చేయడం లేదు. మంచుతెరల మాటున చిక్కుకుంటున్న సూర్యుడు ఉదయం 8-9 గంటలైతే కానీ బయటకు రావడం లేదు. గ్రామాలపై మంచుదుప్పటి పరుచుకుంటుండడంతో పనులకు సైతం వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలైన లంబసింగిలో 10 డిగ్రీలు, మోదకొండమ్మ పాదాలులో 12, అరకు, చింతపల్లి, మినుములూరులో 13, పాడేరులో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.