: కేంద్రమంత్రి ఔదార్యం.. విమానంలో తన ఫస్ట్‌క్లాస్ సీటును మరో మహిళకు ఇచ్చేసిన జయంత్ సిన్హా!


విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ కోసం కేంద్రమంత్రి జయంత్ సిన్హా తన ఫస్ట్ క్లాస్ సీటును వదులుకుని సాధారణ వ్యక్తిగా మరో సీటులో కూర్చుని తన ఔదార్యాన్ని చాటుకున్నారు. బెంగళూరు నుంచి రాంచీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రేయ ప్రదీప్ అనే యువతి తన తల్లితో కలిసి అదే విమానంలో ప్రయాణిస్తోంది. తల్లి కాలికి దెబ్బతగలడంతో ఆమె నడవలేని స్థితిలో ఉంది. దీనికి తోడు విమానంలో వారికి కేటాయించిన సీటు సరిగా లేకపోవడంతో అందులో కూర్చునేందుకు ఆమె ఇబ్బంది పడింది. తల్లి అవస్థ గమనించిన శ్రేయ అదే విమానంలో ప్రయాణిస్తున్న కేంద్రమంత్రి జయంత్ సిన్హా వద్దకు వెళ్లి పరిస్థితి వివరించి, తమ సీట్లోకి వెళ్లి ఆ సీటును ఇవ్వాల్సిందిగా కోరింది. మంత్రి మరేమీ మాట్లాడకుండా భార్యతో కలిసి సీట్లు మారి వారికి తమ సీట్లను అప్పగించారు. మంత్రి చేసిన సాయాన్ని శ్రేయ ట్విట్టర్ ద్వారా పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. సిన్హాతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి ‘‘యు ఆర్ వెరీ వెల్‌కమ్’’ అని రీట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News