: నిఖిల్ రెడ్డికి వైద్య సేవలు ఆపివేశారంటూ తల్లిదండ్రుల ఆవేదన
ఎత్తు పెరిగేందుకు నిఖిల్ రెడ్డికి తప్పుడు శస్త్రచికిత్స చేసిన గ్లోబల్ ఆసుపత్రి వైద్యుడు చంద్రభూషణ్ పై తెలంగాణ వైద్య మండలి వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో, ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడిందంటూ నిఖిల్ రెడ్డి తల్లిదండ్రులు వాపోతున్నారు. సదరు ఆసుపత్రి వైద్యులు తమ కొడుకుకి వైద్యం చేయడం లేదని, దీంతో, కాళ్లకు ఇన్ ఫెక్షన్ సోకిందని వాపోయారు. తమ కుమారుడి పరిస్థితిని అర్థం చేసుకుని తక్షణం వైద్య సేవలు అందించాలని నిఖిల్ రెడ్డి తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా, తప్పుడు వైద్యం చేసిన వైద్యులపై తెలంగాణ వైద్య మండలి రెండు రోజుల క్రితం వేటు వేసింది.