: 'కృష్ణానగర్' కష్టాలు నా జీవితంలోనూ ఉన్నాయి: పాటల రచయిత భాస్కరభట్ల
కృష్ణానగర్ కష్టాలు తన జీవితంలోనూ ఉన్నాయని, అదొక విచిత్రమైన జీవితమని పాటల రచయిత భాస్కరభట్ల అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, కృష్ణానగర్ జీవితం, అక్కడి విషయాలన్నీ గుర్తొస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందని, ఇన్ని ఇబ్బందులు పడ్డా కూడా వెనక్కి వెళ్లకుండా సక్సెస్ అయ్యానని హ్యాపీగా ఫీలవుతానని అన్నారు. మన లక్ష్యాన్ని సాధించినప్పుడే ఆనందానికి అర్థం తెలుస్తుందని, ఒక ఫెయిల్యూర్ తర్వాత ఇచ్చే సక్సెస్ చాలా కిక్ ఇస్తుందని అన్నారు.