: ఈరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో చినజీయర్ స్వామికి షష్టి పూర్తి మహోత్సవం


ఈరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో త్రిదండి చినజీయర్ స్వామికి షష్టి పూర్తి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్లు నరసింహన్, విద్యాసాగర్ రావు, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ‘చిన జీయర్ స్వామి వారు ఆశ్రమం స్వీకరించి 36 సంవత్సరాలు అయింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ‘గానలహరి’ కార్యక్రమం ఏర్పాటు చేశాం. స్వామి వారి పేరుపైన భక్తిపాటలు, అంథ విద్యార్థులు, గిరిజన విద్యార్థులతో నిర్వహించే కార్యక్రమాలు ఉంటాయి. 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో కార్యక్రమాలు మొదలవుతాయి. సుమారు యాభై వేల పైచిలుకు భక్తులు ఈ కార్యక్రమానికి రావచ్చని భావిస్తున్నాము. విదేశాల నుంచి జీయర్ ట్రస్టుకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు’ అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News