: ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది: రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో రైతు పోరు యాత్రను టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, సింగరేణి భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని అన్నారు. రైతులను చైతన్యవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని ఆయన మండిపడ్డారు.