: ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయుధాలు ధరించి ఉంటామంటే సరికాదు: ఏపీ డీజీపీ సాంబశివరావు
ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మావోయిస్టులు ఆయుధాలు ధరించి ఉంటామనడం సరికాదని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. విజయవాడలో ఆయన మీడియతో మాట్లాడుతూ, మా దగ్గర ఆర్కే లేడని కోర్టుకు తెలిపామని, ప్రతీకారం తీర్చుకోవడమనేది మావోయిస్టుల పంథా అని అన్నారు. మావోయిస్టులను చర్చలకు రమ్మని పలుసార్లు ఆహ్వానించామని, అయినా వారు రావడం లేదని అన్నారు. ఏవోబీలో కూంబింగ్ నిలిపివేసి వారం రోజులు అవుతోందని, రాష్ట్రంలో ముఖ్యమైన వ్యక్తులందరికీ మరింత భద్రత పెంచామని అన్నారు.