: కేశవరెడ్డిపై రికవరీ చట్టం: చినరాజప్ప
కర్నూలు కేంద్రంగా విద్యా సంస్థలను ప్రారంభించి ఎన్నో ఏళ్లుగా ప్రజలను వంచిస్తూ వచ్చిన కేశవరెడ్డిపై రికవరీ చట్టాన్ని ప్రయోగించనున్నట్టు ఏపీ హోం మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. ఈ చట్టంతో కేశవరెడ్డి బాధితులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు వెల్లడించారు. మహానంది మండలం బుక్కాపురంలో జరుగుతున్న జనచైతన్యయాత్రలో ఆయన పాల్గొని టీడీపీ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. కేశవరెడ్డి అక్రమాలు తెలుసుకుని తాను ఆశ్చర్యపోయానని అన్నారు. అటువంటి మోసగాళ్లను చట్టం ముందు నిలిపి కఠినంగా శిక్షిస్తామని చినరాజప్ప అన్నారు.