: బాలీవుడ్ నటుడు ఆదిత్యా పంచోలీకి ఏడాది జైలుశిక్ష
తన పొరుగింటి వ్యక్తిపై చెయ్యి చేసుకున్నందుకు ముంబై స్థానిక కోర్టు బాలీవుడ్ నటుడు ఆదిత్యా పంచోలీకి ఏదాడి జైలు శిక్ష విధించింది. అంధేరీ సబర్బన్ కోర్టు మేజిస్ట్రేట్ అమితాబ్ పంచ్ భాయ్ ఈ మేరకు తీర్పిచ్చారని, నేరపూరిత కుట్రతో, పంచోలీ తన పక్కింటి వ్యక్తిపై చెయ్యి చేసుకున్నాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. శిక్ష అనంతరం రూ. 12 వేల పూచీకత్తు తీసుకుని పంచోలీని బెయిల్ పై విడుదల చేసినట్టు తెలిపారు. కాగా, 2005లో ఈ కేసు నమోదు కాగా, బాధితుడు ప్రతీక్ పస్రానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆదిత్యా నిందితుడని కోర్టు ముందు ప్రవేశపెట్టి దోషిగా నిరూపించగలిగారు.