: పేపర్లమ్ముతూ ఐఐటీకి... 'సూపర్' వైరల్ అవుతున్న శివాంగి కథ!


శివాంగి... కాన్పూర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే దేహా గ్రామం. తన తండ్రితో కలసి కుటుంబ పోషణకు దినపత్రికలు అమ్ముతుండేది. గవర్నమెంట్ హైస్కూల్ లో చదువుకుంటూ తండ్రి వ్యాపారంలో సాయపడుతూ ఉండేది. ఓ రోజు పేపర్ తిరగేస్తుంటే, పేద కుటుంబాలకు చెందిన పిల్లల్ని ఐఐటీ ఇంజనీర్లుగా తయారు చేస్తున్న ఆనంద్ కుమార్ 'సూపర్ 30' గురించి కనిపించింది. ఆపై అక్కడికి వెళితే, కోచింగ్ కు ఎంపికైంది. ఆపై ఇంకేముందీ, ఐఐటీ ఎంట్రెన్స్ లో మంచి మార్కులు, గ్రాడ్యుయేషన్, మంచి కార్పొరేట్ ఉద్యోగం. ఇక శివాంగి ఇప్పుడు ఎందుకు ప్రస్తావనకు వచ్చిందని అడుగుతారా? ఉద్యోగం తెచ్చుకోగానే శివాంగి విజయగాథను ఆనంద్ కుమార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన దగ్గరికి వచ్చిన సమయంలో, ఆపై ఉద్యోగంలో చేరిన తరువాత శివాంగి ఫోటోలను ఉంచుతూ, ఆమె కథను నలుగురికీ స్ఫూర్తిని కలిగేలా ఉంచారు. ఈ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్.

  • Loading...

More Telugu News