: పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం.. ఏఎస్సై దుర్మరణం
పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై దుర్మరణం పాలయ్యారు. బైక్‌పై వెళ్తున్న ఏఎస్సై భుజంగరెడ్డిని నిమ్స్ ఆస్పత్రి వద్ద వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మెట్రో పనుల కారణంగా రోడ్డు అస్తవ్యస్తంగా మారడం, గుంతలమయం కావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. భుజంగరెడ్డి అంబర్‌పేట పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఏఎస్సై. లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.