: టీమిండియా సహచరుల సమక్షంలో కోహ్లీ బర్త్‌డే వేడుకలు
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ నెల 9 నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం రాజ్‌కోట్‌కు టీమిండియా ఆటగాళ్లు చేరుకున్నారు. టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రేయసి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి అక్కడకు వచ్చాడు. కాగా, ఈ రోజు కోహ్లీ తన తన 28వ జన్మదిన వేడుకల్ని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగానే ఆయన ఎంతో హుషారుగా తన ప్రేయసితో కలిసి సందడి చేశాడు. రాజ్‌కోట్‌లోని ఇంపీరియల్ హోటల్‌లో టీమిండియా ఆటగాళ్లు, అనుష్కశర్మ మధ్య పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నాడు. టెస్టు సిరీస్‌కి సెలక్ట్ అయిన టీమిండియా ఆటగాళ్లందరూ ఈ వేడుకలో పాల్గొని కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.