: తమ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ‘జనసేన’ ప్రకటన విడుదల.. పలువురికి పార్టీ బాధ్యతల అప్పగింత
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు జనసేన పార్టీ ఇందుకు సంబంధించిన ఒక ప్రకటనను విడుదల చేస్తూ.. అందులో పలు విషయాలు పేర్కొంది. పార్టీ బలోపేతంపై తాము దృష్టి సారించినట్లు, తమ నాయకులు బొంగునూరి మహేందర్‌రెడ్డి, నేమూరి శంకర్‌గౌడ్, పి.హరిప్రసాద్‌లకు జనసేన పార్టీలో పలు కీలక బాధ్యతలు ఇచ్చినట్లు ప్రకటనలో పేర్కొంది. పవన్ కల్యాణ్ జనసేనను స్థాపించే సమయంలో పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్న మహేందర్‌రెడ్డి తెలంగాణలో పార్టీ కో ఆర్డినేటర్‌గా కార్యక్రమాల బాధ్యతలను ఇకపై చూసుకోనున్నారు. జనసేన తెలంగాణ ఇన్ఛార్జిగా నేమూరి శంకర్ గౌడ్, పార్టీ మీడియా విభాగ బాధ్యతలను సీనియర్ పాత్రికేయుడు పి.హరిప్రసాద్ నిర్వహించనున్నారు.