: భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేసిన భర్త!
భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను దారుణంగా హత్యచేసిన ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ నగరంలో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో నివసించే యోగేష్‌కు భార్య, ఓ కూతురు ఉన్నారు. అయితే, కొంత కాలంగా తన భార్య ఆర్తిపై అనుమానం పెంచుకున్న యోగేష్ కొన్ని రోజుల క్రితం ఆమెను దారుణంగా హతమార్చాడు. ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి వాటిని అల్వార్‌లోని పలు ప్రదేశాల్లో విడివిడిగా పడేశాడు. తద్వారా కేసు నుంచి తప్పించుకోవాలని యోచించాడు. అయితే, ఆర్తి కాలును గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరపగా వారికి పలు ప్రాంతాల్లో మిగిలిన శరీర భాగాలు లభించాయి. చివరికి మృతదేహం ఎవరిదనే విషయాన్ని గుర్తించిన పోలీసులు హర్యానాలోని హిస్సార్‌లో యోగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. తన భార్యపై అనుమానంతోనే తాను ఆమెను హతమార్చినట్లు పోలీసుల ముందు నిందితుడు ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు.