: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల బ్యాగుల నుంచి 2,100 సౌదీ రియాల్స్, మూడు సెల్‌ఫోన్లు మాయం!


హైద‌రాబాద్ శివారులోని శంషాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టులో సిబ్బందిపై మ‌రోసారి ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన ప్ర‌యాణికుల నుంచి సిబ్బంది 2,100 సౌదీ రియాల్స్, మూడు సెల్‌ఫోన్లు చోరీ చేశారు. ఈ రోజు నిజామాబాద్‌కు చెందిన దశరథ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సాదిఖ్ అనే వ్య‌క్తులు జెడ్డా నుంచి విమానంలో అక్క‌డ‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో త‌మ‌ లగేజీని చూసుకున్న‌ తరువాత, త‌మ బ్యాగులు చిరిగి ఉండటంతో వీరు షాక‌య్యారు. అందులో త‌మ వ‌స్తువులు క‌నిపించ‌క‌పోవ‌డంతో బ్యాగేజి సిబ్బందే చోరీకి పాల్ప‌డ్డార‌ని ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News