: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సల్మాన్ ఖాన్ మద్దతు ఎవరికో తెలుసా?


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలవాలని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కోరుకుంటున్నాడు. తన కోరికను ట్విట్టర్ ద్వారా సల్లూ భాయ్ వెల్లడించాడు. "మీరు గెలుస్తారని భావిస్తున్నా. రాజ్యాంగాన్ని, మానవ విలువలను అనుసరించే నైతిక బలాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్" అంటూ సల్మాన్ ట్వీట్ చేశాడు. ఈ నెల 8వ తేదీన అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ ట్రంప్ గెలుస్తారా? లేదా డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్ గెలుస్తారా? అనే విషయంపై సర్వత్ర చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News