: తాను ప్రథమ మహిళ అయితే ఏం చేస్తుందో చెప్పిన ట్రంప్ భార్య


అమెరికా అధ్యక్షుడి ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంటోంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయానికి ఆయన సతీమణి మెలానియా కూడా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ తాను అమెరికాకు ప్రథమ మహిళ అయితే... అన్నిటికన్నా ముందు సోషల్ మీడియా కల్చర్ పై దృష్టి సారిస్తానని చెప్పారు. ఇతరులను అవమానించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు, ఫొటోలు ఉండరాదనేది తన ఉద్దేశం అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో బుల్లీయింగ్ ఎక్కువైంది. మనుషుల ఆకారాలు, హావభావాలు మొదలైన వాటిని కించపరిచేలా ట్వీట్లు చేయడం ఎక్కువైంది. ట్రంప్ కూడా ఇదే స్టైల్ లో తన ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే, ఇంటర్నెట్ ద్వారా ఇతరులపై దాడి చేయడం సరికాదని మెలానియా అన్నారు. తాను ప్రథమ మహిళ అయితే... సోషల్ మీడియా కల్చర్ కు సరైన మార్గనిర్దేశం చేస్తానని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News