: భారత్-పాక్ సరిహద్దులో కమ్ముకున్న యుద్ధ మేఘాలు... 190 కి.మీ. మేర పాక్ బలగాల మోహరింపు


భారత్, పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్ పై పగతో రగిలిపోతున్న పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ముఖాముఖి యుద్ధానికి సిద్ధమవుతోంది. సరిహద్దులో 190 కిలోమీటర్ల మేర పాకిస్థాన్ తన బలగాలను భారీగా మోహరించింది. అంతేకాదు, భారీగా ఆయుధాలను తరలిస్తోంది. వారం రోజుల నుంచి సరిహద్దు వద్ద పాక్ సైన్యం కదలికలు ఎక్కువయ్యాయి. మరోవైపు, ఇప్పటికే సరిహద్దు ఆవల ఉన్న పాక్ సైన్యానికి చెందిన నాలుగు పోస్టులను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. అంతేకాదు, 20 మంది పాక్ సైనికులను హతమార్చింది. ఈ నేపథ్యంలో, పాక్ చేస్తున్న సన్నాహకాలపై భారత సైన్యం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. పాక్ కు దిమ్మతిరిగే రీతిలో దీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది. కోలుకోలేని రీతిలో పాక్ ను దెబ్బతీయాలని భావిస్తోంది. ఈ క్రమంలో, సరిహద్దు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ ఈ నెలాఖరులో పదవి నుంచి వైదొలగుతున్నారు. ఈ నేపథ్యంలో, తన చివరి రోజుల్లో ఆయన సైనికపరంగా భారత్ కు వ్యతిరేకంగా ఏమైనా చేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News