: బెంగళూరులో ఆరెస్సెస్ కార్యకర్తను చంపడానికి మంత్రి సుపారీ ఇచ్చాడు: ఎంపీ శోభ


బెంగళూరులో ఆరెస్సెస్ కార్యకర్త రుద్రేశ్ ను హత్య చేయడం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతానికి సంబంధించి బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజె తీవ్ర ఆరోపణలు చేశారు. నిన్న బెంగళూరులో ఆమె మాట్లాడుతూ, శివాజీనగర్ ఎమ్మెల్యే, నగరాభివృద్ధి శాఖ మంత్రి రోషన్ బేగ్ ఈ హత్య చేయించారని... దీనికోసం హంతకులకు ఆయన సుపారీ ఇచ్చారని ఆరోపించారు. శివాజీనగర్ నియోజకవర్గ పరిధిలో రాజకీయంగా రుద్రేశ్ ఎదుగుతుండటంతో... రోషన్ బేగ్ ఓర్వలేకపోయారని అన్నారు. ఈ కేసును ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర్ లు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మరోవైపు, శోభా కరంద్లాజె తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రోషన్ బేగ్ అన్నారు. కేవలం రాజకీయ ప్రచారం కోసమే ఆమె ఈ ఆరోపణలు చేశారని, ఎన్నో ఏళ్లుగా శివాజీ నగర్ లో ఉంటున్న తాను... అన్ని వర్గాలను కలుపుకుని పోతున్నానని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఎంఐఎం పెద్దలు బెంగళూరుకు రావడాన్ని కూడా తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు. శోభపై పరువునష్టం దావా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News