: ఓఆర్ఓపీపై మోదీ అస‌త్యాలు ప్రచారం చేస్తున్నారు: రాహుల్ గాంధీ ఆగ్రహం


వ‌న్ ర్యాంక్, వ‌న్ పింఛ‌న్ (ఓఆర్ఓపీ)ని అమ‌లు చేయడంపై కేంద్రం వ‌హిస్తోన్న నిర్ల‌క్ష్యానికి మ‌న‌స్తాపం చెంది ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ మాజీ సైనికుడు రామ్ కిష‌న్ గ్రేవాల్ కుటుంబాన్ని ఈ రోజు మ‌ధ్యాహ్నం కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పరామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... మాజీ సైనికుల‌ను కేంద్రం మోసం చేస్తోంద‌ని అన్నారు. ఓఆర్ఓపీపై ప్ర‌ధాని మోదీ అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నారని విమ‌ర్శించారు. అస‌త్యాలు చెప్ప‌డం మానుకొని ఓఆర్ఓపీని స‌మర్థంగా అమ‌లు చేయాల‌ని ఆయ‌న మోదీకి సూచించారు. మాజీ సైనికుడి కుటుంబ వ్య‌క్తుల‌పై పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరు న్యాయం కాద‌ని, దీనికి ప్ర‌భుత్వం క్ష‌మాప‌ణ‌లు కోరాల‌ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రైతులు, జవాన్ల స‌మ‌స్య‌ల ప‌ట్ల‌ కేంద్రం నిర్ల‌క్ష్య ధోర‌ణి క‌న‌బ‌రుస్తోంద‌ని, వారంటే కేంద్రానికి గౌర‌వం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. మాజీ సైనికులు ఓఆర్ఓపీ అంశంపై అసంతృప్తిగా ఉన్నార‌ని అన్నారు.

  • Loading...

More Telugu News