: సంస్థాగతంగా పలు కీలక మార్పులు ప్రకటించిన టాటా గ్రూప్
టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి ఇటీవలే సైరస్ మిస్త్రీని తొలగించిన ఆ సంస్థ ఈ రోజు సంస్థాగతంగా తీసుకున్న పలు మార్పులను ప్రకటించింది. టాటా గ్రూప్ హెచ్ ఆర్ విభాగం చీఫ్‌గా ఎస్.పద్మనాభన్ ను, విదేశాల్లో టాటా గ్రూప్ నిర్వహణ బాధ్యతలు ముకుంద రాజన్‌కు అప్పగిస్తున్నట్లు పేర్కొంది. ఆయన అమెరికా, సింగపూర్, దుబాయి, చైనాలో సంస్థల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపింది. టాటా బ్రాండ్ నిర్వహణ బాధ్యతలు హరీశ్‌భట్‌కు అప్పగిస్తున్నట్లు పేర్కొంది. కాగా, టాటా గ్రూప్ చైర్మన్ పదవిలో ఎవరిని నియమిస్తారనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.