: కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే సాయాన్ని వదులుకోమని కోరుతున్నారా?: వైసీపీకి గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు ప్రశ్న


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 6న విశాఖపట్నంలో ‘జై ఆంధ్రప్రదేశ్‌’ పేరిట‌ భారీ బహిరంగ సభ నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు పూర్తిచేసుకుంటున్నారు. ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు మండిప‌డ్డారు. ఈ సభను జ‌గ‌న్‌ ఎందుకు పెడుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేంద్రం రాష్ట్రానికి ప్ర‌క‌టించిన‌ ప్రత్యేక ప్యాకేజీని జ‌గ‌న్‌ తీసుకోమంటారో.. వద్దంటారో ఇంత‌వ‌ర‌కు చెప్పలేద‌ని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే సాయాన్ని వదులుకోమని కోరుతున్నారా? అని ఆయన ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల‌ తిరుపతిలో జగన్, దిగ్విజయ్ మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌ని వారు ఏం మాట్లాడుకున్నారో చెప్పాలని ఆయ‌న పేర్కొన్నారు. దిగ్విజయ్ రాష్ట్రానికి ఓ శనీశ్వరుడని ముద్దు కృష్ణమ నాయుడు ఎద్దేవా చేశారు. వైసీపీ పార్టీ ఏనాటికైనా కాంగ్రెస్‌లో కలిసిపోతుంద‌ని అన్నారు.

  • Loading...

More Telugu News