: హైదరాబాద్ లో బీజేపీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్.. రోడ్డుపైనే పడుకుని నిరసన


ఓఆర్ఓపీని అమ‌లు చేయాల‌ని పోరాడుతూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ మాజీ సైనికుడు రామ్ కిష‌న్ గ్రేవాల్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు ఆసుప‌త్రికి వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడిని పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ అరెస్టుని నిర‌సిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళ‌న చేప‌ట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయ ముట్టడికి వీరు ప్రయత్నించ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. పోలీసుల‌కి, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మ‌ధ్య తోపులాట జ‌రిగింది. రోడ్డుపైనే పడుకుని ఆందోళ‌న‌కారులు నిర‌స‌న తెలిపారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News