: ‘స్వేచ్ఛను హరించడమే’.. ఎన్డీటీవీపై విధించిన బ్యాన్‌ను ఎత్తివేయాలని బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
ప్రసారాల నియమాలను ఉల్లంఘించారన్న కారణంతో ఎన్డీటీవీ ప్రసారాలను ఒక రోజు పాటు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిన్న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో అక్కడి పలు కీలక ప్రదేశాలను ఆ ఛానెల్ ప్రసారం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ అంశంపై బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ ఈ రోజు స్పందించింది. భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని పేర్కొంది. ఎన్డీటీవీపై విధించిన ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.