: సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్న రోజు 80 మంది గార్డులు అక్కడ డ్యూటీలో లేరు!


భోపాల్ సెంట్రల్ జైల్ నుంచి తప్పించుకున్న 8 మంది సిమీ ఉగ్రవాదులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. జైలు నుంచి తప్పించుకునే క్రమంలో ఓ హెడ్ కానిస్టేబుల్ ని కూడా ఉగ్రవాదులు చంపేశారు. అయితే, పటిష్ట భద్రత ఉన్న సెంట్రల్ జైల్ నుంచి ఉగ్రవాదులు ఎలా తప్పించుకున్నారనే ప్రశ్న అందరిలో తలెత్తింది. కానీ, ఆశ్చర్యపోయే విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన రోజున 80 మంది గార్డులు అక్కడ లేరనే విషయం తెలిసింది. వీరంతా వేరే చోట డ్యూటీలో ఉన్నారట. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, జైళ్ల శాఖ మంత్రి కుసుమ్ మెహ్దెలే, మాజీ జైళ్ల శాఖ మంత్రులు, జైళ్ల శాఖ అధికారులు, జైళ్ల హెడ్ క్వార్టర్ వద్ద వీరు విధులు నిర్వహిస్తున్నారట. 3,300 మంది నేరగాళ్లు ఉన్న ఈ జైలుకు కేవలం 139 మంది గార్డులు మాత్రమే ఉన్నారు. సిమీ ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకున్న రోజు ఏం జరిగిందంటే... టూత్ బ్రష్ లతో ముందుగానే తయారు చేసుకున్న ఒక డజన్ తాళాలను ఉపయోగించి సెల్ నుంచి ఉగ్రవాదులు బయటకు వచ్చారు. అక్కడ ఉన్న ఓ గార్డును కట్టిపడేశారు. అనంతరం ఓ హెడ్ కానిస్టేబుల్ గొంతు కోసి అతడిని చంపేశారు. వీరున్న సెల్ వద్ద సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడంతో... ఈ దృశ్యాలు రికార్డ్ కాలేదు. అంతేకాదు, ఆ ప్రాంతంలో ఉండాల్సిన నలుగురు సాయుధ గార్డులు సరైన స్థానాల్లో ఉండకపోవడం కూడా ఉగ్రవాదులకు కలిసొచ్చింది. ఆ తర్వాత దుప్పట్ల సాయంతో 30 అడుగుల గోడను ఎక్కి, జైలు నుంచి వీరు బయటపడ్డారు. అయితే, జైలు గేట్ వద్ద ఉన్న ఓ గార్డు రోడ్డు దాటుతున్న నలుగురు వ్యక్తులను చూసి అలారం మోగించాడు. దీంతో, జైలు నుంచి బయటపడ్డ ఎనిమంది ఉగ్రవాదులు అక్కడ నుంచి పరారయ్యారు. జైలుకు 10 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామం వరకు వెళ్లారు. కొన్ని గంటల తర్వాత ఆ గ్రామానికి కొంత దూరంలో ఎన్ కౌంటర్ అయ్యారు.

  • Loading...

More Telugu News