: బిల్లులు చెల్లించకుంటే నల్లా, డ్రైనేజ్ కట్.. చర్యలకు దిగుతున్న హైదరాబాద్ వాటర్ బోర్డు


బిల్లులు చెల్లించని వారిపై హైదరాబాద్ వాటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నీటి సరఫరాను ఆపివేయడమే కాక, డ్రైనేజ్ కనెక్షన్ ను కూడా తొలగించాలని నిర్ణయం తీసుకుంది. వాటర్ బోర్డు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎండీ దానకిషోర్ ఈ మేరకు తన సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మొండి బకాయిదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశించారు. వాణిజ్య కనెక్షన్ లు కలిగిన వారిపై కూడా కఠిన చర్యలకు వెనుకాడవద్దని సూచించారు. ఆలస్యం చేయకుడా నల్లా బిల్లును చెల్లించాలంటూ వినియోగదారులకు ఈ సందర్భంగా ఆయన విన్నవించారు. నల్లా, డ్రైనేజ్ కనెక్షన్లను తొలగించిన తర్వాత బిల్లు చెల్లించేందుకు వచ్చినా... జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News