: మాంసం ఎక్కువగా తినే దేశాలు ఇవే


అమెరికన్ ప్రజలు సంవత్సరకాలంలో సరాసరిన ఏకంగా 126.6 కేజీల మాంసాన్ని లాగించేస్తున్నారట. ముక్క లేనిదే అమెరికన్లకు ముద్ద దిగడం లేదట. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. కేవలం లగ్జెంబర్గ్ (142.5 కిలోలు), హాంకాంగ్ (134 కిలోలు) మాత్రమే అమెరికా కన్నా ముందున్నాయట. భారత్ సరాసరి ఏడాదికి 5.1 కిలోల వినియోగంతో 169వ స్థానంలో నిలిచింది. 175 దేశాలతో విడుదల చేసిన ఈ జాబితాలో బంగ్లాదేశ్ అట్టడుగు స్థానాన్ని ఆక్రమించింది. బంగ్లాలో తలసరి వినియోగం కేవలం 3.1 కిలోలు మాత్రమే ఉంది. బురుండీ తలసరి వినియోగం 3.7 కేజీలు, కాంగో వినియోగం 4.6 కేజీలుగా ఉంది. 83.9 కేజీల తలసరి వినియోగంతో బ్రిటన్ 25వ స్థానంలో నిలిచింది. ఈ వివరాలను ఐక్యరాజ్యసమితికి చెందిన 'ది స్టేట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్' నివేదిక వెల్లడించింది.

  • Loading...

More Telugu News