: అమెరికన్ యాక్షన్ హీరో స్టీవెన్ సీగల్ కు రష్యా పౌరసత్వమిచ్చిన పుతిన్


అమెరికన్ యాక్షన్ హీరో, బాలీవుడ్ స్టార్ స్టీవెన్ సీగల్ కు రష్యా పౌరసత్వాన్ని ఇస్తూ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం పెట్టారు. ఇటీవలి కాలంలో సీగల్ పలుమార్లు రష్యాను సందర్శించడం, పలు విషయాల్లో రష్యా ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతుండటంతోనే ఆయనకు పౌరసత్వాన్ని ఇచ్చే అంశంలో పుతిన్ సానుకూల ధోరణి కనబరిచినట్టు తెలుస్తోంది. ఆయన రష్యాలో ఇప్పటికే చాలా కాలం ఉన్నారని, గత కొంత కాలంగా పౌరసత్వాన్ని అడుగుతున్నారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మీడియాకు తెలిపారు. రష్యాపట్ల అతనికెంతో గౌరవముందని, ఆయన దాన్ని ఎన్నడూ దాచుకోలేదని తెలిపారు. కాగా, 2013లో వెటరన్ ఫ్రెంచ్ స్టార్ గెరార్డ్ డిపార్డియోకు రష్యా పౌరసత్వాన్ని, పాస్ పోర్టును ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News