: మసీదులో సెల్‌ఫోన్‌లో మాట్లాడినందుకు రూ.300 ఫైన్.. జాతి వివక్ష అంటూ కేంద్ర మంత్రికి యువతి ఫిర్యాదు


మసీదులో తమపై జాతి వివక్ష చూపారంటూ అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన నియాంగ్ పార్టిన్ అనే యువతి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజుకు వీడియో సందేశం ద్వారా ఫిర్యాదు చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ లా విద్యార్థిని అయిన నియాంగ్ తన స్నేహితులతో కలిసి ఇటీవల ఢిల్లీలోని జామా మసీదును సందర్శించింది. ఈ సందర్భంగా సెల్‌ఫోన్‌లో మాట్లాడిన తనతోపాటు స్నేహితులు ఒక్కొక్కరు రూ.300 చొప్పున ఫైన్ చెల్లించాలంటూ సిబ్బంది తమను బెదిరించారని వీడియో సందేశంలో ఆరోపించింది. ఇతరులు అందరూ సెల్‌ఫోన్లు తీసుకెళ్తున్నా తమను మాత్రమే అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈశాన్య ప్రాంతానికి చెందిన తాను ప్రతిసారీ తన జాతీయతను నిరూపించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. మ్యూజియం, పార్క్.. ఇలా బయటకు ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డు అడుగుతున్నారని పేర్కొంది. తాను విదేశీయురాలిని కాదని, అచ్చమైన భారతీయురాలినని పేర్కొన్న నియాంగ్ తమను భారతీయులుగా గుర్తించే రోజు ఎప్పుడు వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన మంత్రి కిరణ్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నియాంగ్‌కు రీట్వీట్ ద్వారా తెలిపారు.

  • Loading...

More Telugu News