: నేనూ విభజన బాధితుడినే.. నేను ఇక్కడ.. నా భార్య హైదరాబాద్‌లో!: ఏపీ సీఎం చంద్రబాబు
రాష్ట్ర విభజన బాధితుల్లో తానూ ఒకడినని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి వెలగపూడిలోని సచివాలయ భవనాలను గురువారం చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. ఓ ఉద్యోగి మాట్లాడుతూ విభజన కారణంగా తాను భార్యాపిల్లలతో విడిపోవాల్సి వచ్చిందని అన్నారు. వారు హైదరాబాద్‌లో ఉంటే తాను ఇక్కడ పనిచేయాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన చంద్రబాబు రాష్ట్ర విభజన గాయాలు తనకూ తగిలాయని అన్నారు. తానూ విభజన బాధితుడినేనని తెలిపారు. ‘‘నేను ఇక్కడ.. నా భార్య హైదరాబాద్‌లో’’ అన్నారు.